హైద‌రాబాద్ టెకీకి షాక్‌.. వీసా ఇంట‌ర్వ్యూకి 470 రోజులు ఆగాల‌ట‌

waiting time for visa interview is 470 days for a hyderabad techie

Hyderabad: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న ఓ హైద‌రాబాద్ టెకీకి షాకింగ్ ఘ‌ట‌న ఎదురైంది. వీసా ఇంట‌ర్వ్యూ స్లాట్ బుక్ చేసుకునేందుకు పోర్ట‌ల్ ఓపెన్ చేయ‌గా.. ఏకంగా 470 రోజులు ఆగాల‌ని చూపించింద‌ట‌. అమిత్ అనే టెకీ త‌న స్నేహితుడికి వీసా ఇంట‌ర్వ్యూ స్లాట్ బుక్ చేసేందుకు పోర్ట‌ల్ ఓపెన్ చేసాడు. అందులో 470 రోజులు ఆగితే కానీ వీసా స్లాట్ దొర‌క‌ద‌ని ఉంది. దాంతో అత‌ను షాకై ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు. త‌న‌కు తెలిసిన వారు ఏజెంట్ల‌కు వేల‌ల్లో డబ్బులు ఇచ్చి ద‌గ్గ‌ర్లోని స్లాట్లు బుక్ చేయించుకున్నార‌ట‌. దాదాపు రెండు రోజుల నుంచి స్లాట్ కోసం చూస్తుండ‌గా మొత్తానికి ఆగ‌స్ట్ 26కు దొరికింద‌ట‌. ప్ర‌య‌త్నం ఆప‌కపోవ‌డం మంచిదైంద‌ని అమిత్ తెలిపాడు.