VVS Laxman: కంటిన్యూ అవ్వలేనన్న ద్రావిడ్.. కోచ్ బాధ్యతలు లక్ష్మణ్‌కు..!
భారత క్రికెట్ టీం కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ (rahul dravid) తన కాంట్రాక్ట్ అయిపోవడంతో ఇక కొనసాగలేనని BCCIకి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో కోచ్ బాధ్యతలు వీవీఎస్ లక్ష్మణ్‌కు (vvs laxman) అప్పగించనున్నట్లు సమాచారం. మొన్న జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో (icc world cup) ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా (india vs australia) ఓడిపోవడంతో ఇక ద్రావిడ్ కోచ్‌గా కొనసాగకపోవడమే ఉత్తమం అని అనుకుంటున్నారట. ఒకవేళ టీమిండియా కప్ గెలిచి ఉంటే బహుశా తన కాంట్రాక్ట్ పొడగించుకునేవారని.. అలా జరగకపోవడంతో టీమిండియా ఓటమికి తనే బాధ్యత తీసుకుని తప్పుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.