Tirupati: స్థలం కబ్జా చేసిన వాలంటీర్.. అడిగితే రక్తం వచ్చేలా దాడి

Tirupati: ఓ వాలంటీర్ (ap volunteer) స్థ‌లం క‌బ్జా చేయ‌డ‌మే కాకుండా ఇదేంటి అని అడిగినందుకు ర‌క్తం వచ్చేలా దాడి చేసాడు. ఈ దారుణం తిరుప‌తిలోని (tirupati) చంద్ర‌గిరి మండ‌లంలో చోటుచేసుకుంది. కల్ రోడ్డు పల్లెకు ఎందిన రామ‌కృష్ణ‌, ఈశ్వ‌రి దంప‌తుల‌కు ప్ర‌భుత్వం కేటాయించిన స్థలంలో స్థానిక వాలంటీరు క‌బ్జా చేసి రేకుల షెడ్డు వేయాల‌నుకున్నాడు. విష‌యం తెలిసి నిలదీయ‌గా వారిని ర‌క్తం వచ్చేలా చిత‌క‌బాదారు.  VROతో కలసి వాలంటీర్ పొసిష‌న్ సర్టిఫికెట్ సంపాదించి ఆక్రమణలకు యత్నిస్తున్నాడని వాలంటీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.