Kakinada: ల‌వ్ ఫెయిల్యూర్.. వాలంటీర్ ఆత్మ‌హ‌త్య‌

Kakinada: వాలంటీరుగా పని చేస్తున్న ప్రియురాలికి పెళ్లి కుదిరిందని మ‌రో వాలంటీర్ (volunteer) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న కాకినాడ‌లో (kakinada) జ‌రిగింది. రేచర్లపేట చినవీధికి చెందిన మోర్తా దేవాశీష్‌కు ప్రవీణ అనే యువతితో వివాహం అయింది. ఆల్రెడీ పెళ్లి అయినప్ప‌టికీ స్థానిక‌ వెంకట్ నగర్‌లో వాలంటీరుగా పనిచేస్తున్న యువతితో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. అయితే ఆ యువ‌తికి వివాహం నిశ్చయం అయింది. ఈ విష‌యం తెలిసి మనోవేదనకు గురైన దేవాశీష్ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.