Virat Kohli అనుష్క నుంచి అనౌన్స్‌మెంట్..!
వరల్డ్ కప్ (world cup) దగ్గరపడుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) తన ఫ్రెండ్స్‌కి ఓ రిక్వెస్ట్ చేసారు. వరల్డ్ కప్ వీక్షించడానికి టికెట్స్ దొరక్కపోతే దయచేసి తనను అడగవద్దని.. కావాలంటే ఇంట్లో కూర్చుని హాయిగా వీక్షించండి అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. దీనికి అనుష్క శర్మ (anushka sharma) కూడా ఒక క్యాప్షన్ జోడించారు. ఒకవేళ మెసేజ్‌లకు రిప్లై రాకపోతే దయచేసి నాకు మాత్రం మెసేజ్‌లు పెట్టకండి. అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. సాధారణంగా ఏదైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కానీ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కానీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ టికెట్స్ ఇప్పించమని అడుగుతుంటారు. దాంతో కోహ్లీ ముందు జాగ్రత్తగా ఈ ప్రకటన చేసేసారు. త్వరలో భారత్‌లో జరగనున్న ICC వరల్డ్ కప్ మ్యాచ్‌ల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి.