Virat Kohli: అన్ని కోట్లు రావు బ్రో..!
Hyderabad: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (virat kohli) బ్రాండ్ విలువ వందల కోట్లల్లో ఉంటుంది. ఆయన ఏ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించినా దగ్గర దగ్గర రూ.20 కోట్ల వరకు వసూలు చేస్తారట. అంతేకాదు.. ఆ బ్రాండ్‌కి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదన్నా పోస్ట్ పెడితే రూ.11 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోనే మూడో రిచెస్ట్ క్రికెటర్ అని ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ HQ వెల్లడించింది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని కోహ్లీ స్పష్టం చేసారు. “” నాకు జీవితంలో ఇప్పటివరకు దొరికిన వాటి పట్ల నేనెప్పుడూ రుణపడి ఉంటాను. కానీ నా సోషల్ మీడియా సంపాదనపై వస్తున్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదు “” అని కోహ్లీ క్లియర్‌గా చెప్పారు. (virat kohli)