Viral News: రోడ్డును చేత్తో లేపేసారు..!
Maharashtra: కొత్తగా వేసిన రోడ్డును కొందరు ఏకంగా చేత్తో లేపేసారు. ఈ వైరల్ ఘటన (viral news) మహారాష్ట్రలో (maharashtra) చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఉన్న అంబాడ్ తాలూకాలో లోకల్ కాంట్రాక్టర్ ద్వారా రోడ్డు వేయించారు. తీరా చూస్తే అది తారుతో వేసిన రోడ్డు (road) కాదు. ఏదో నల్ల కార్పెట్‌లాగా కప్పి ఉంచిన రోడ్డు. ఏదో తేడాగా ఉందే అని కొందరు గ్రామస్థులు చేత్తో పట్టుకుని చేస్తే అది కార్పెట్‌లాగా ఉంది. దాంతో వెంటనే వీడియో తీసి వైరల్ చేసారు. ఈ రోడ్డు వేయించిన కాంట్రాక్టర్ పేరు రానా ఠాకూర్ అని గ్రామస్థులు వీడియోలో తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన స్కీం కింద కాంట్రాక్టర్ ఇలా కార్పెట్ రోడ్డును వేయించారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. పైగా ఈ రోడ్డును జర్మన్ టెక్నాలజీతో వేయించినదని కాంట్రాక్టర్ చెప్పాడట. ఇలాంటి రోడ్లు వేస్తే వాహనాలు వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని, ఇది మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.