హైదరాబాద్ న‌ల్ల‌కుంట‌లో వింత ఘటన

viral incident happened in hyderabad

Hyderabad: హైదరాబాద్ నల్లకుంటలోని విద్యా నగర్లో వింత ఘటన చోటుచేసుకుంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా నగర్ వద్ద ఓ మహిళ మ‌ద్యం మ‌త్తులో ఆర్టీసీ బస్సుని ఆపే ప్ర‌య‌త్నం చేసింది. అత‌ను బస్సు ఆప‌కుండా వెళ్లిపోవ‌డంతో బ‌స్సుపై బీర్ బాటిల్‌తో దాడి చేసింది. దీంతో బస్సు వెనుక భాగం లోని అద్దం ధ్వంసమైంది. వెంట‌నే డ్రైవ‌ర్ బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయ‌గా.. ఆగ్రహంతో బస్సు డ్రైవర్ పై తన వద్ద ఉన్న పామును విసిరేసింది. భయంతో డ్రైవ‌ర్ అక్క‌డి నుంచి పారిపోయాడు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు మహిళను న‌ల్ల‌కుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.