Chandrayaan 3 రెండో విజయం
చంద్రయాన్ 3 (chandrayaan 3) మిషన్‌లో భాగంగా జాబిల్లిపైకి పంపించిన విక్రమ్ ల్యాండర్ (vikram lander) ఇచ్చిన గోల్స్ కంటే ఎక్కువే సాధించిందని ఇస్రో (isro) వెల్లడించింది. ఇస్రో ఇచ్చిన కమాండ్ ప్రకారం హాప్ ఎక్స్‌పరిమెంట్ చేయడంలో సక్సెస్ అయింది. హాప్ ఎక్స్‌పరిమెంట్ (hop experiment) ద్వారా విక్రమ్ ఇంజిన్లను రన్ చేసి 40 సెంటీమీటర్లు ఎగిరి మరో 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సక్సెస్‌ఫుల్‌గా సాఫ్ట్ ల్యాండింగ్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం మొదటి విజయం అయితే.. ఇప్పుడు హాప్ ఎక్స్‌పరిమెంట్‌లో భాగంగా రెండోసారి కూడా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం రెండో విజయం. విక్రమ్ ల్యాండ్ అయ్యాక ఇప్పటివరకు ఒకే ప్రదేశంలో నిలకడగా ఉంది. ఈరోజే ఉన్న ప్రదేశంలో నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రదేశంపై ల్యాండ్ అయింది. (chandrayaan 3)