Chandrayaan 3: స్లీప్ మోడ్‌లోకి విక్ర‌మ్, ప్ర‌జ్ఞాన్..!

చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్‌లో భాగంగా జాబిల్లిపై ఉన్న విక్ర‌మ్ ల్యాండ‌ర్ (vikram lander) , ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌లు (pragyan rover) కొన్ని రోజుల పాటు స్లీప్ మోడ్‌లోకి వెళ్ల‌నున్నాయి. ప్ర‌స్తుతం విక్ర‌మ్ నుంచి ప్ర‌జ్ఞాన్ 100 మీట‌ర్ల దూరంలో ఉంద‌ని ఇస్రో ఛైర్మ‌న్ సోమ్‌నాథ్ వెల్ల‌డించారు. 15 రోజుల పాటు చంద్రుడిపై సూర్యుడి వెలుగు ఉండ‌దు కాబ‌ట్టి ఈ రెండింటికీ స్లీప్ మోడ్‌లోకి పంపనున్నారు. ఆ త‌ర్వాత రోవ‌ర్, ల్యాండ‌ర్‌ల‌తో ఎలాంటి ప‌ని ఉండ‌దు. వాటిని మ‌ళ్లీ భూమిపైకి తీసుకురావ‌డం వంటివి ఉండ‌వు. కాక‌పోతే కావాల్సిన స‌మాచారాన్ని సేక‌రిస్తూ విక్ర‌మ్ ఇస్రోకు పంపుతూ ఉంటుంది.