Vijayawada: వ్యాపారుల బట్టలు ఊడదీసి.. దారుణం!
Vijayawada: ధర్మవరం చీరల వ్యాపారుల పట్ల విజయవాడ (vijayawada) వ్యాపారులు దారుణంగా ప్రవర్తించారు. బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులతో విజయవాడకు చెందిన వ్యాపారులు గొడవకు దిగారు. వారిని నిర్బంధించి తీవ్రంగా దాడి చేసారు. కోపంతో ఊగిపోయిన బెజవాడ వస్త్ర దుకాణ వ్యాపారి విచక్షణ మరచి ఇద్దరు వ్యాపారుల బట్టలు ఊడదీసి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యాపారులను వీడియోలు తీశాడు. ఆపై వీడియోలను ధర్మవరంలో వ్యాపారులకు పంపించి వికృతంగా ప్రవర్తించాడు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (viral news) అవుతున్నాయి.