Viral News: వక్షోజాల సర్జరీ చేయించుకున్న యువతి.. బయటికొచ్చిన వీడియో
Viral News: ఓ యువతి వక్షోజాల సర్జరీ చేయించుకోగా.. ఆమెకు తెలీకుండా ఆ వీడియో బయటికొచ్చింది. దాంతో ఆమె హాస్పిటల్‌పై దావా వేసింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. సెంట్రల్ చైనాకి చెందిన గోవా అనే యువతి.. స్థానిక హాస్పిటల్‌లో వక్షోజాలు పెంచుకునే సర్జరీ చేయించుకుంది. అయితే ఆ సమయంలో ఎవరో వీడియో తీసారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె కంటపడింది. దాంతో ఆమె షాక్‌కు గురైంది.
వెంటనే హాస్పిటల్‌కు ఫోన్ చేసి ఆ వీడియో ఎవరు తీసారో వెంటనే డిలీట్ చేయిద్దాం అనుకుంది. కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా హాస్పిటల్ వారు స్పందించలేదట. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవసీకి భంగం కలిగించినందుకు నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది.