Kidnap Drama: లవర్‌తో లేచిపోయి..పెద్ద స్కెచ్చే..!
Uttar Pradesh: ఓ యువతి ప్రేమించినవాడితో పారిపోయింది. అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి చేతిలో ఉద్యోగం లేకుండా తినడానికి, ఉండటానికి డబ్బు ఎలా? ఇవేమీ ఆలోచించకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. డబ్బులు అవసరం అయ్యేసరికి కన్నవారు గుర్తుకొచ్చారు. వెళ్లిపోయి మళ్లీ డబ్బు కోసం ఇంట్లో వారిని అడగడానికి మొహం చెల్లదు. అందుకే కిడ్నాప్ డ్రామా ఆడింది. (kidnap drama)
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. కాన్పూర్‌కి (kanpur) చెందిన హన్సిక వర్మ అనే యువతి స్థానిక వ్యక్తిని ప్రేమించి, ఎవ్వరికీ తెలీకుండా పెళ్లి కూడా చేసేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 4న హన్సిక తండ్రికి ఓ వీడియో మెసేజ్ వచ్చింది. ఆ వీడియోలో మీ కూతురిని కిడ్నాప్ చేసాం.. రూ.10 లక్షలు ఇస్తే వదిలేస్తాం అని హన్సికను కట్టేసినట్లు ఉంది. దాంతో హన్సిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపడుతున్న పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. హన్సిక ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేస్తే ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్లు తెలిసింది. తీరా వెళ్లి చూస్తే ఆ హోటల్‌లో హన్సికతో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు. వారి దగ్గర దొరికిన బ్యాగును చెక్ చేస్తే అందులో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది. గట్టిగా నిలదీస్తే లేచిపోవాలనుకున్నామని కానీ డబ్బు లేకపోవడంతో ఇలా కిడ్నాప్ డ్రామా ఆడామని నిజం ఒప్పుకున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. (kidnap drama)