నాకు భారత రత్న ఇవ్వాలి.. కమిషనర్‌కు లేఖ రాసిన వ్యక్తి
Uttar Pradesh: భారత రత్న (bharat ratna) అనేది దేశంలోనే అత్యున్నత పురస్కారం. ఇది దక్కించుకోవాలంటే ఏ రంగంలో అయినా విశేషమైన సేవ చేసి ఉండాలి. కళ, సమాజసేవ, సాహిత్యం, సాంస్కృతిక, విద్య, విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక, సామాజిక, ప్రజా జీవనరంగాల్లో అపార సేవలు అందించిన విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అలాంటిది ఓ సామాన్య వ్యక్తి తనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని ఏకంగా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసాడు. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు రాసాడో తెలుసుకుందాం.
గోరఖ్‌పూర్‌కి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి రోజూ ఉదయాన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు. అయితే రెండు రోజుల క్రితం అతను ఇలాగే ధ్యానం చేస్తుంటే నాకు భారత రత్న కావాలి.. నాకు భారత రత్న కావాలి అని తన మనసు తనకే చెప్తున్నట్లు మాటలు వినిపించాయట. ఇలా పలుమార్లు జరగడంతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసాడు. అయితే ఈ లేఖను అధికారులంతా స్వీకరిస్తున్నట్లు స్టాంప్స్ కనిపిస్తున్నాయి కానీ అది నిజమా లేక ఏఐ ద్వారా అలా క్రియేట్ చేసారా అని తెలియాల్సి ఉంది. స్థానిక మీడియా వర్గాలు పోలీసులను సంప్రదించినా కూడా వారు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయడంలేదట.