H 1B: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌

America: అమెరికాలో H 1B వీసాల‌పై నివ‌సిస్తున్న భార‌తీయుల‌కు శుభ‌వార్త‌. వీసాల‌ను అమెరికాలోనే రెనువ‌ల్ చేయించుకునేందుకు అమెరికా ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ప్రోగ్రామ్ వ‌ల్ల దాదాపు 2 ల‌క్ష‌ల మంది H 1B వీసాదారుల‌కు లాభం చేకూర‌నుంది. ఈ రెనువ‌ల్ ప్రోగ్రామ్ 2024 జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది. ఫెడ‌ర‌ల్ రిజిస్ట‌ర్‌లో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నోటీస్ రిలీజ్ అయ్యాకే రూల్స్ అనౌన్స్ చేస్తారు.

గ‌తంలో వీసా రెనువ‌ల్ చేయించుకునేందుకు మ‌ళ్లీ ఇండియా రావాల్సి ఉండేది. దీని వ‌ల్ల చాలా మంది భార‌తీయులు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సి వ‌చ్చేది. ఇప్పుడు అమెరికాలోనే రెనువ‌ల్ చేయించుకునే వీలు ఉంటుంది కాబ‌ట్టి బోలెడంత స‌మ‌యం ఆదా అవుతుంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.