Wanted Husband: భ‌ర్తను వెతికిపెడితే రూ.4 ల‌క్ష‌లు!

America: పై ఫొటోలో క‌నిపిస్తున్న యువ‌తిని చూసారా. ఈమె పేరు ఈవ్ టిల్లే కూల్స‌న్. వ‌య‌సు 35. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్పొరేట్ లిటిగేష‌న్ ఎటార్నీగా ప‌నిచేస్తోంది. ఇప్పుడు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈమెకు పెళ్లి చేసుకోవ‌డానికి ఓ మ‌గాడు కావాలంట‌. ఎవ‌రైనా మంచి భ‌ర్త‌ను వెతికిపెడితే అక్ష‌రాలా రూ.4 ల‌క్ష‌లు ఇస్తానంటోంది. (wanted husband)

ఇంత‌కుముందు ఈ డీల్‌ని కేవ‌లం త‌న బాస్, ఫ్రెండ్స్ ద‌గ్గర మాత్ర‌మే కుదుర్చుకుంది. ఇప్పుడు టిక్ టాక్ ద్వారా ప‌బ్లిక్‌కి కూడా చెప్పేసింది. ఎవరైనా నాకు ఒక మ‌గాడిని చూసి పెట్టి అత‌న్ని నేను పెళ్లి చేసుకుంటే వారికి 5వేల డాల‌ర్లు రిఫ‌ర‌ల్ బోన‌స్‌గా ఇస్తాను. అత‌నితో నేను ఎంత‌కాలం ఉంటాను అనేది చెప్ప‌లేను. బ‌హుశా 20 ఏళ్ల త‌ర్వాత నేను అత‌నికి విడాకులు ఇచ్చేయొచ్చు. అదంతా మీకు అన‌వ‌స‌రం. నాకు మంచి మ‌గాడిని వెతికి పెడితే రిఫ‌ర‌ల్ బోన‌స్ మీ సొంతం అని ప్ర‌క‌టించింది.

గ‌త ఐదేళ్లుగా ఈవ్ సింగిల్‌గానే ఉంటోంద‌ట. డేటింగ్ చేసి చేసి చిరాకేసింద‌ట‌. త‌న‌కు కావాల్సిన అబ్బాయి కోసం వివిధ డేటింగ్ యాప్స్ ట్రై చేసినా దొర‌క‌లేద‌ట‌. ఇక త‌నకు కాబోయే భ‌ర్త‌కు వ‌య‌సు 25 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాల‌ట‌. 5 అడుగుల 11 అంగుళాల పొడ‌వు ఉండాల‌ని తెలిపింది. అత‌నికి బ్రిటిష్ టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ ఉండాలట‌. ఇంకా జంతువులు, పిల్ల‌లంటే ఇష్ట‌ముండాలి, స్పోర్ట్స్ అంటే కూడా ఇష్టం బాగా ఉండాల‌ట‌. కావాలంటే లాంగ్ డిస్‌టెన్స్ రిలేష‌న్‌షిప్‌లో అయినా ఉంటాన‌ని తెలిపింది.

చివ‌రిగా తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు మాత్రం అస్స‌లు ఉండ‌కూడ‌ద‌ట‌. మ్యారేజ్ స‌ర్టిఫికేట్ మీద సంత‌కం పెట్టిన మ‌రుక్ష‌ణ‌మే త‌న‌కు భ‌ర్త‌ను వెతికిపెట్టిన‌వారి చేతిలో ఆ 5 వేల డాల‌ర్లు పెట్టేస్తాన‌ని అంటోంది ఈవ్.