Viral News: ఎన్నికల్లో ఓట్ల కోసం NOTA పేరు పెట్టుకున్నాడు..!
Viral News: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టెక్సాస్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన పేరును నోటాగా మార్చుకున్నాడు. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుతానికైతే అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జో బైడెన్లకు (Joe Biden) కాకుండా LITకి ఓటు వేస్తున్నారు. మనకు నోటా ఎలాగో అమెరికన్లకు LIT అని ఉంటుంది. దీని అర్థం లిటరల్లీ నోబడీ ఎల్స్ (Literally Nobody Else).
ఈ నేపథ్యంలో ఆ ఓట్లు తనకు పడతాయని భావించి ఏకంగా తన పేరునే లిటరల్లీ నోబడీ ఎల్స్ అని మార్పించేసుకున్నాడు టెక్సాస్‌కి చెందిన డస్టిన్ ఎబోయ్ అనే వ్యక్తి. ఇతను ఒకప్పుడు ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం స్కూల్లో ఏడో తరగతి పిల్లలకు లెక్కల పాఠాలు చెప్తున్నాడు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇతను కూడా పోటీ చేయాలనుకున్నాడు. కానీ ముక్కూ మొహం తెలీని వారికి ఓట్లు వేయరు కాబట్టి ఓటు వేసే సమయంలో మూడో ఆప్షన్ అయిన లిటరల్లీ నోబడీ ఎల్స్ అని మార్చేసుకున్నాడు. ఇతని పాస్‌పోర్ట్‌లో కూడా అదే పేరు ఉండటం గమనార్హం.
అమెరికా అధ్యక్షులుగా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ విఫలం అయ్యారని.. వారు కాకుండా అమెరికాలోని మిగతా వారు కూడా పోటీ చేయచ్చని చెప్తున్నాడు.