US Visa: 90 వేల మంది భార‌త‌ విద్యార్థుల‌కు వీసాలు జారీ

అమెరికా ప్ర‌భుత్వం ఈ ఏడాది జూన్, జులై ఆగ‌స్ట్ నెల‌ల్లో ఏకంగా 90 వేల మంది భార‌తీయ విద్యార్థుల‌కు వీసాలు (us visa) జారీ చేసింది. ఇది రికార్డ్ అని అమెరికా తెలిపింది. అమెరికా జారీ చేసిన ప్ర‌తి నాలుగు వీసాల‌లో ఒక‌టి ఇండియాకి చెందిన‌ద‌ని పేర్కొంది. 2022లో అత్య‌ధిక విద్యార్థులు అమెరికాలో ఉన్న దేశంగా ఇండియా చైనాను దాటేసింది. అంటే ఇప్పుడు చైనా కంటే మ‌న విద్యార్థులే అమెరికాలో ఎక్కువ‌గా ఉన్నారు. 2020 నాటికి అమెరికాలో భార‌త్‌కు చెందిన 207,000 విద్యార్థులు అమెరికాలో విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఇంకాస్త పెరిగింది. ఇందుకు కార‌ణం అప్లికేష‌న్ ప్ర‌క్రియ‌ను కాస్త సుల‌భ‌త‌రం చేయ‌డం అమెరికా యూనివ‌ర్సిటీలు విద్యార్థుల‌కు ఆర్థిక సాయం, స్కాల‌ర్‌షిప్స్ ఇవ్వ‌డమే..! ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఇదే బాట‌లో ఉంది. 2030 నాటికి 30 వేల మంది భార‌తీయ విద్యార్థుల‌కు ఆహ్వానించ‌నుంది. ఇందుకోసం అవ‌స‌ర‌మైన ప్రక్రియ‌ను ఫ్రాన్స్ యూనివ‌ర్సిటీలే చూసుకుంటాయి.