“ఆమె నాతో ఓరల్ సెక్స్ చేయించుకుంది.. నాకు తీవ్ర గాయాలయ్యాయి”
USA Senator: క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఆడవారికే కాదు మగవారికి కూడా శాపంగా మారింది అని చెప్పే సంఘటన ఇది. పై ఫోటోలో కనిపిస్తున్న మహిళను చూసారా? ఈమె పేరు మేరీ ఆల్వరాడో గిల్. కాలిఫోర్నియాకు చెందిన సెనేటర్. ఈమె వద్ద స్టాఫ్ చీఫ్‌గా పనిచేసిన చాడ్ కాండిట్ అనే వ్యక్తి తనను లైంగికంగా వేధించింది అంటూ కోర్టుకెక్కాడు. ఉద్యోగం కావాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తన లైంగిక కోరికలు తీర్చాలని మేరీ డిమాండ్ చేసిందట. అలా తనతో చాలా సార్లు ఓరల్ సెక్స్ చేయించుకుందని.. దాని వల్ల తనకు వెన్నులో నొప్పి, మూడు డిస్క్‌లకు హెర్నియా వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వైద్య రిపోర్టులను కూడా జత చేసాడు.
ఓసారి పని మీద కారులో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో బాత్రూమ్ కోసం ఆగారని.. తాను బాత్రూమ్‌కి వెళ్లి మళ్లీ కారు ఎక్కుతుంటే అప్పటికే మేరీ తన ప్యాంట్ విప్పేసి.. వచ్చి నీ నిజాయతీని ప్రూవ్ చేసుకో అని బెదిరింపులకు పాల్పడిందని పిటిషన్‌లో రాసారు. కారులో జాగా లేకపోవడంతో తన చేత బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడేలా చేసిందని.. ఆ సమయంలో తనకు వెన్నెముక భాగంలో గాయమై సియాటికాకు దారి తీసిందని కూడా స్పష్టం పేర్కొన్నారు. గతేడాది తనకు వెన్నెముక నొప్పి ఉందని ఇక తాను చెప్పినట్లు చేయలేనని చెప్పి తప్పించుకుంటే.. అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తూ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నట్లు తనకు నోటీసులు పంపినట్లు కూడా ఆరోపించారు.
దీనిపై మేరీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేవలం డబ్బు కోసమే ఇంతటి నీచమైన ఆరోపణలకు పాల్పడుతున్నాడని.. ఈ విషయం కోర్టులోనే తేలుతుందని వెల్లడించారు.