Jaahnavi Kandula: పోలీస్ కామెంట్స్.. జాహ్నవి గురించి కాదట!
అమెరికాలో (america) తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (jaahnavi kandula) యాక్సిడెంట్‌లో చనిపోతే డ్యానియర్ ఆడరర్ (daniel auderer) అనే అక్కడి పోలీస్ అధికారి చేసిన అమానవీయ కామెంట్స్‌పై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే డ్యానియల్ ఈ వివాదంపై స్పందించారు. తాను చేసిన కామెంట్స్ అసలు జాహ్నవి గురించి కాదని.. ఈ కేసును వాదిస్తున్న కొందరు లాయర్ల గురించని తెలిపారు. పూర్తి ఆడియో వినకుండా కేవలం లీక్ అయిన ఆడియోనే విని తన గురించి తప్పుగా మాట్లాడట సరికాదని తెలిపారు.
జరిగిన ఘటన ఇది
ఈ ఏడాది జనవరిలో పోలీస్ ప్యాట్రోల్ కారు ఢీకొనడంతో జాహ్నవి కందుల అనే కర్నూలుకు చెందిన యువతి దుర్మరణం చెందింది. ఆ సమయంలో సియాటిల్‌కి చెందిన డానియల్ ఆడెరర్ అనే పోలీస్ అధికారి నవ్వుతూ.. ఇది తనకు జరగాల్సిందే అనడం తన బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఆడియో టేప్ బయటికి రావడంతో సియాటిల్ పోలీసులపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ అమ్మాయికి ఏమైందో అని కూడా చూడకుండా.. కాసేపు ఆగి నవ్వుకుంటూ.. చనిపోయిందని ఆ అధికారి అరవడం మొత్తం ఆ బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. (america) ఈ విషయం కాస్తా సియాటిల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ వద్దకు వెళ్లడంతో వాళ్లు వెంటనే విచారణకు ఆదేశించారు. సంబంధిత అధికారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. (jaahnavi kandula)
భగ్గుమన్న తెలుగు రాష్ట్రాలు
ఆ అధికారి తీరుపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు మండిపడ్డారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి KTR, ఏపీ సీఎం జగన్ (ap cm jagan) తెలిపారు. మరోపక్క జాహ్నవిని కోల్పోయిన బాధలో ఉన్న ఆమె కుటుంబీకులు.. ఈ పోలీస్ అధికారి గురించి వచ్చిన వార్తలు చూసి గుండెపగిలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.