Money Earning Tip: మొక్క నాటితే రూ.350..!
Money Earning Tip: మొక్క నాటితే రూ.350 సంపాదించచ్చు. అలా ఎన్ని నాటితే అన్ని డబ్బులు వస్తాయి. ఇదేదో బాగుంది కదూ..! ఈ ఆలోచన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కార్బన్ సోఖో ఔర్ పైసా కమావో అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వీలైనన్ని చెట్లు నాటించి గ్రీన్ హౌజ్ వాయువులను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ పథకాన్ని అందరూ అర్హులేనా అంటే.. కాదు.. ఈ పథకం కేవలం ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన రైతుల కోసం మాత్రమే.
రైతులు నాటిన మొక్కలను ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆ రైతులకు రూ.350 ఇస్తారు. ఇలా ఎన్ని చెట్లు నాటితే అంత డబ్బు వస్తుంది. అలాగని ఇష్టమొచ్చినట్లు నాటేస్తాం అంటే కుదరదు. దీనికి కూడా కొన్ని రూల్స్ పెట్టారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 25,140 మంది రైతులు రూ.202 కోట్లు అర్జించారు. ఇప్పటివరకు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.