Court: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం అవ్వదు
Court: భార్యతో బలవంతంగా అసహజ శృంగారం చేస్తే అది అత్యాచారం అవ్వదని తేల్చి చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఓ మహిళ తన భర్తపై రేప్ కేసు పెట్టడంతో దానిని పరిశీలించిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించింది. కట్టుకున్న భార్యతో భర్త ఎలాంటి అసహజ శృంగారానికి పాల్పడినా అది అత్యాచారం కింద పరిగణించబడదని.. విడాకులు తీసుకున్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అత్యాచారం అవుతుందని వెల్లడిస్తూ కేసును కొట్టేసారు. మన దేశంలో వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించబడలేదు. ఈ అంశానికి సంబంధించిన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.