Russia Ukraine War: కాఫీ తాగుతుంటే ఏసేసాం

Ukraine launched a surprise attack deep into Russian territory

Russia Ukraine War: ర‌ష్యా చేస్తున్న యుద్ధాన్ని త‌ట్టుకోలేక‌పోయిన ఉక్రెయిన్ మొన్న ఆగ‌స్ట్ 6న ర‌ష్యాపై స‌ర్‌ప్రైజ్ ఎటాక్ చేసింది. క‌ర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ రష్యా సైన్యంపై భీక‌ర దాడికి పాల్ప‌డింది. ఉక్రెయిన్‌కి చెందిన వోలోడిమిర్ అనే సైనికుడు తాము చేసిన దాడిని వివ‌రిస్తూ.. ర‌ష్యా సైనికులు ఆయుధాలు లేకుండా స‌ర‌దాగా కాఫీ తాగుతుంటే వారిని ఏసేసాం అని వెల్ల‌డించారు.

తొలి రోజు ర‌ష్యాకి చెందిన ఆయుధాల్లేని సైనికులంద‌రినీ ఏరిపారేసామ‌ని.. ఇంకొంత మంది సైనికులు లొంగిపోయార‌ని అన్నారు. ఆగ‌స్ట్ 12 నాటికి ర‌ష్యాకి చెందిన దాదాపు 74 గ్రామాలు, ప‌ట్టణాల‌ను ఉక్రెయిన్ సైనికులు ఆక్ర‌మించేసుకున్నారు. ఉక్రెయిన్ ఇంత‌కింత అనుభ‌వించేలా చేస్తాన‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చ‌రించాడు. 2024 ఆగస్టు 15న, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా దళాల నుంచి సుద్జా నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు విముక్తిని ప్రకటించారు.