పెళ్లి కానుకల లొల్లి.. అల్లుడు, వియ్యంకుడిని చంపేసిన వ్యక్తి
UK: పెళ్లి కానుకల విషయంలో గొడవ తలెత్తడంతో ఓ వ్యక్తి అల్లుడిని వియ్యంకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన యూకేలో చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అహ్మద్ ఆల్సినో కూతురికి వివాహం జరిగింది. వివాహ వేడుకలో అహ్మద్ తన కుమార్తెకు బంగారం కానుకగా ఇచ్చాడు. మార్చి నెలలో ఆ బంగారు కానుకల విషయంలో అహ్మద్‌కు తన వియ్యంకుడు ఇబ్రహీంకు మధ్య గొడవ జరిగింది. ఆ కోపంలో ఇబ్రహీంను కత్తితో పొడిచి చంపేసాడు. ఆ తర్వాత తన అల్లుడి పీక కోసేసాడు. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిన్న ముగియడంతో కోర్టు నిందితుడికి 26 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది.