UK Journalist: చంద్రయాన్ సక్సెస్..మా డబ్బులు తిరిగిచ్చేయండి
ఇస్రో (isro) చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 (chandrayaan 3) సక్సెస్ అయిన నేపథ్యంలో యావత్ ప్రపంచం మన దేశానికి జేజేలు కొడుతోంది. ఈ నేపథ్యంలో యూకేకి చెందిన ఓ జర్నలిస్ట్ (uk journalist) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్యాట్రిక్ క్రిస్టిస్ (patrick christis) అనే న్యూస్ రీడర్ న్యూస్ చదువుతూ.. చంద్రయాన్-3 లాంచ్‌లో ఇండియా విజయవంతం అయింది కాబట్టి ఇప్పటివరకు 2016 నుంచి 2021 వరకు యూకే ఇండియాకు కేటాయించిన 2.3 బిలియన్ పౌండ్స్ ఫండ్స్‌ను తిరిగిచ్చేయాలని అన్నాడు.
“” చంద్రయాన్-3 సక్సెస్ అయిన సందర్భంగా భారత్‌కు నా అభినందనలు. ఈ సందర్భంగా మీకు 2016 నుంచి 2021 వరకు యూకే ఇచ్చిన 2.3 బిలియన్ పౌండ్ల సహాయ నిధిని తిరిగిచ్చేయండి. మీకు 2024లో 53 మిలియన్ పౌండ్లు అందనున్నాయి. బ్రిటిష్ ట్యాక్స్ పేయర్లు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్పేస్ ప్రోగ్రామ్‌ల కోసం ఏ దేశానికి కూడా మనం సహాయ నిధిని ఇవ్వకూడదు అనే రూల్ తీసుకురావాలి “” అని అన్నాడు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ మొదలైంది. అతను భారత విజయం పట్ల కుళ్లుకుంటున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. (uk journalist)
ఈ నీచుడు ఇంతటితో ఆగలేదు. ఇండియాను పేదరిక దేశమని వ్యాఖ్యానించాడు. చంద్రుడి పైకి రాకెట్ లాంచ్ చేసేంత శక్తి భారత్‌కు ఉన్నప్పుడు సాయం కోసం ఇతర దేశాల దగ్గర చేయిచాచే అవసరం ఏముందని అన్నాడు. భారత్‌ను సొంత ప్రభుత్వం ఆదుకోలేనప్పుడు తమలాంటి దేశాలు ఎందుకు ఆదుకోవాలి అని ప్రశ్నించాడు. ఇతను సొంతంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగాడో వాడికే తెలియాలి. అక్కడి ప్రభుత్వం ఇతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.