Uber డ్రైవ‌ర్ నిర్వాకం.. మ‌హిళ‌కు ప్రైవేట్ పార్ట్స్ చూపించి..

Bengaluru: బెంగ‌ళూరులో ఉబ‌ర్ (uber) డ్రైవ‌ర్‌ల ప్ర‌వ‌ర్త‌న‌లు మ‌రీ మితిమీరుతున్నాయి. తాజా సంఘ‌ట‌నతో ఆడ‌వారు క్యాబ్‌లు బుక్ చేసుకోవాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. బెంగ‌ళూరుకు (bengaluru) చెందిన ఓ యువ‌తి BTM నుంచి జేపీ న‌గ‌ర్ మెట్రోకి ఉబ‌ర్ (uber) క్యాబ్ బుక్ చేసుకుంది. డ్రైవ‌ర్ వ‌చ్చి ఆమెను పిక‌ప్ చేసుకున్నాడు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. ఉన్న‌ట్టుండి వేరే రూట్‌లో వెళ్ల‌డం మొద‌లుపెట్టాడు. అది గ‌మ‌నించిన ఆ యువ‌తి వెంట‌నే అలెర్ట్ అయ్యి మ‌ధ్య‌లోనే దిగిపోతాన‌ని చెప్పింది. డ‌బ్బులు ఇస్తుంటే ఆ డ్రైవ‌ర్ ప్రైవేట్ పార్టులు చూపించి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. ఈ విష‌యాన్ని బాధితురాలు లింక్డిన్‌లో పెట్టి ఉబ‌ర్‌, బెంగ‌ళూరు పోలీసుల‌ను ట్యాగ్ చేసింది. వెంట‌నే స్పందించిన ఉబ‌ర్.. ఆ డ్రైవ‌ర్‌ను తొల‌గించారు. పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. విష‌యం తెలీగానే ఉబ‌ర్ (uber) త‌న‌ను సంప్ర‌దించి ఏం జ‌రిగిందో తెలుసుకుని వెంట‌నే యాక్ష‌న్ తీసుకున్నందుకు కాస్త ధైర్యం వ‌చ్చింద‌ని ఆ యువ‌తి తెలిపింది.