Suriya: ఇద్దరు సూర్య అభిమానులు దుర్మరణం
AP: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈరోజు సూర్య (suriya) బర్త్‌డే సందర్భంగా తమ ఇంటి దగ్గర్లో కటౌట్ పెడుతుండగా కరెంటు షాక్ తగిలింది. దాంతో ఇద్దరూ తూలిపోతూ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. అసలే వర్షాకాలం. ఇలాంటి టైంలో ఫ్లెక్సీలు, కటౌట్‌లు పెట్టడానికి మేడలపైకి కరెంట్ పోల్స్‌పైకి ఎక్కడం చాలా డేంజర్. ఇంకా ఈ ఘటనపై సూర్య (suriya) స్పందించాల్సి ఉంది.