గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని ప్రాణాలు కోల్పోయిన వైద్యులు
గూగుల్ మ్యాప్‌ని (google maps) నమ్ముకుని భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు ఘోర ప్రమాదం జరగడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేరళలో (kerala) జరిగింది. అద్వైత్, అజ్మల్ అనే ఇద్దరు యువ డాక్టర్లు నిన్న రాత్రి కొచ్చి ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కారులో ప్రయాణిస్తున్నారు. అప్పటికే భారీ వర్షం పడుతోంది. గూగుల్ మ్యాప్ ఎటు చూపిస్తే అటు కారు నడుపుకుంటూ వెళ్లారు. తీరా చూస్తే నీరు నిండిపోయి ఉన్న ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. అప్పటికైనా వారు వెళ్తోంది రాంగ్ రూట్ అని తెలుసుకుని వెనక్కి వెళ్లాల్సింది. గూగుల్ మ్యాప్‌లో అదే నీటిలో నుంచి వెళ్లాలి అని చూపించడంతో వారు అలాగే వెళ్లిపోయారు. తీరా చూస్తే అది పెరియార్ నది. రాత్రి కనిపించకపోవడంతో వారు కారుని నదిలోకి పోనివ్వడంతో మునిగిపోయి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.