Twitter: తీసేసిన వారిని మ‌ళ్లీ ఉద్యోగంలోకి..!

Hyderabad: లే ఆఫ్(lay off) స‌మ‌యంలో తీసేసిన‌వారిని ట్విట‌ర్(twitter) మ‌ళ్లీ హైర్ చేసుకోనుంది. ఈ మేర‌కు ట్విట‌ర్ అధినేత ఎలాన్(elon musk) మ‌స్క్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. లే ఆఫ్ స‌మ‌యంలో తీసేసిన వారి లిస్ట్‌ని మ‌ళ్లీ ప‌రిశీలించ‌గా.. అందులో కొంద‌రిని అన‌వ‌స‌రంగా తీసేసామ‌ని మ‌స్క్ భావించార‌ట‌. వారి అవ‌సరాలు కంపెనీకి ఉండ‌టంతో రీహైర్ చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక్క‌డ ప్ర‌శ్న‌.. ట్విట‌ర్ రీహైర్ చేసుకోవ‌డం కాదు.. తీసేసిన వారిలో కొంద‌రిని మ‌ళ్లీ వెన‌క్కి తీసుకోనున్న నేప‌థ్యంలో వాళ్లు మ‌ళ్లీ జాయిన్ అవుతారా లేదా అన్న‌ది ఇక్క‌డ కీల‌కం. ఎందుకంటే.. ట్విట‌ర్ ఇలా త‌మ‌ను అర్థాంత‌రంగా తీసేస్తుంద‌ని అనుకోలేద‌ని చాలా మంది బాధ‌ప‌డ్డారు. ఇప్ప‌టికీ ఉద్యోగం దొర‌క‌ని వారు బ‌హుశా మ‌ళ్లీ రీహైర్ చేసుకున్నా వెళ్లే అవ‌కాశం ఉంది. కానీ ఆత్మాభిమానం దెబ్బ‌తిన్న‌వారు మ‌ళ్లీ ట్విట‌ర్ ముఖం చూడ‌క‌పోవ‌చ్చు.

అదీకాకుండా 2022లో మ‌స్క్ ట్విట‌ర్‌ను కొనుగోలు చేసారు. అప్ప‌టినుంచి ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌, వ‌ర్క్ చేసే విధానం చాలా మంది ఉద్యోగుల‌కు న‌చ్చ‌లేదు. మ‌స్క్ ట్విట‌ర్‌ను కొనుక్కున్న‌ప్పుడు 7800 మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ అత‌ను లే ఆఫ్ ప్ర‌క‌టించ‌డంతో 1500 మందే మిగిలారు.