NTR Fan Kaushik: బ్లడ్ క్యాన్సర్ బాధితుడి బిల్లు క్లియర్ చేసిన TTD
NTR Fan Kaushik: జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అనే యువకుడు బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ తనకు దేవర సినిమా చూసేంత వరకు బతికాలని ఉందంటూ కన్నీరుపెట్టుకున్న సంగతి తెలిసిందే. అభిమానుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తారక్.. వెంటనే కౌశిక్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. వైద్యానికి సంబంధించి అన్నీ తాను చూసుకుంటానని.. ముందు ధైర్యంగా కోలుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కౌశిక్ హాస్పిటల్ బిల్లు ఇప్పటివరకు రూ.40 లక్షలు అవ్వగా.. ఆ బిల్లును తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్లియర్ చేసారు. బాధితుడు కౌశిక్ తండ్రి తిరుమలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దాంతో తారక్ తితిదే బోర్డుతో మాట్లాడి ఆ బిల్లును సెటిల్ చేయాలని చెప్పారు. ఇప్పుడు కౌశిక్ పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. అయితే.. తన కోరిక ప్రకారం దేవర సినిమా చూసాడో లేదో మాత్రం తెలియరాలేదు.