Toxic Boss: ఎవ‌రైనా చ‌నిపోతేనే ఆ ఆప్ష‌న్ వాడుకోవాలి

toxic boss says only death in a family can be made as an excuse

Toxic Boss: ఈరోజుల్లో కంపెనీల్లో బాసులు, మేనేజ‌ర్లు ఉద్యోగుల‌కు ఎంతటి న‌ర‌కం చూపిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రోజుకో క‌థ లింక్డిన్ వేదిక‌గా బ‌య‌టికి వ‌స్తోంది. ఈరోజు కిర‌ణ్ అనే ఉద్యోగి లింక్డిన్‌లో పోస్ట్ చేసిన విష‌యం బాసులు క‌ర్క‌శంగా త‌యార‌వుతున్నారు అని చెప్ప‌డానికి అద్దం ప‌డుతోంది.

కిర‌ణ్ నిన్న ఆఫీస్‌కి లేట్‌గా వెళ్లాడ‌ట‌. ఇందుకు కార‌ణం అత‌ను ప్ర‌యాణిస్తున్న కారు స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురైంది. ఏంటి కిర‌ణ్ ఇంకా రాలేదు. ఎంత‌సేప‌ట్లో వ‌స్తావ్ అని బాస్ మెసేజ్ చేయ‌గా.. త‌న కారు ప్ర‌మాదానికి గురైంది అని చెప్పేందుకు ఫోను ప్రూఫ్‌గా పెట్టాడు. దానికి బాస్ ఏమ‌ని రిప్లై ఇచ్చాడో తెలుసా? ఓకే కానీ ఒక‌టి గుర్తుపెట్టుకో. కేవ‌లం ఇంట్లో ఏద‌న్నా చావు జ‌రిగితేనే ఆఫీస్‌కి ఆల‌స్యంగా వ‌చ్చే ఆప్ష‌న్ ఉంటుంది. అంతేకానీ ఇలా కారుకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఆఫీస్‌కి లేట్‌గా వ‌స్తే ఊరుకునేది లేదు అని రిప్లైలో పేర్కొన్నాడు. ఆ రిప్లై చూసి ఇలాంటి బాస్ ద‌గ్గ‌రా నేను ప‌నిచేస్తుంది అని కిర‌ణ్ బాధ‌పడ్డాడు. ఇలాంటి వాళ్ల గురించి న‌లుగురికీ తెలియాల‌ని సోష‌ల్ మీడియాలో మెసేజ్ స్క్రీన్ షాట్ పెట్టాడు.