Toll Tax: ముగియ‌నున్న టోల్ ట్యాక్స్ శ‌కం

Toll Tax era is set to end

Toll Tax: హైవేల‌పై హాయిగా ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో చిరాకు తెప్పించేది ఏదైనా ఉందంటే అది టోల్ ట్యాక్స్. దీని వ‌ల్ల ఒక్కోసారి వాహ‌న‌దారులు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి. అయితే త్వ‌ర‌లో ఈ టోల్ ట్యాక్స్ శ‌కానికి ముగింపు ప‌డ‌నుంది. అలా అని ఇక టోల్ ట్యాక్స్‌లు క‌ట్టాల్సిన ప‌ని లేదు అని కాదండోయ్. టోల్ ట్యాక్స్‌లు క‌ట్టాల్సిందే. కాక‌పోతే ఇలా టోల్ ప్లాజాల వ‌ద్ద వాహ‌నాలు ఆపి క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. నేరుగా సాటిలైట్ ద్వారానే ట్యాక్స్ క‌ట్ అవుతుంది.

టోల్ కలెక్ష‌న్ ప్ర‌క్రియ‌ను మెరుగుప‌రిచేందుకు ఈ సాటిలైట్ టోల్ ట్యాక్స్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం GNSSని ఏర్పాటు చేయ‌బోతోంది. GNSS అంటే గ్లోబ‌ల్ నేవిగేష‌న్ సాటిలైట్ సిస్ట‌మ్. ఈ సిస్ట‌మ్‌ని నిర్దిష్ట హైవేల‌పై మాత్ర‌మే ముందు అమ‌లు చేయ‌నున్నారు.  ఈ GNSS సిస్ట‌మ్ ద్వారా ఆటోమేటిక్‌గా సాటిలైట్ ద్వారానే ట్యాక్స్ క‌ట్ అవుతుంది. ఫాస్టాగ్‌లు వాడాల్సిన ప‌నిలేదు.. టోల్ ప్లాజాల వ‌ద్ద వాహ‌నాల‌ను ఆపాల్సిన ప‌ని అంత‌క‌న్నా లేదు.

వాహ‌నం ఎంత దూరం మేర ప్ర‌యాణించింది అదే దానిని బ‌ట్టి సాటిలైట్ టోల్ ట్యాక్స్‌ని క‌ట్ చేసుకుంటుంది. GNSS సిస్ట‌మ్ దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని హైవేల‌పై అమ‌లైతే ఇక టోల్ ప్లాజా గేట్ల‌ను ఎత్తివేస్తారు. GNSS పూర్తిగా అందుబాటులోకి వ‌చ్చేంత వ‌ర‌కు ఫాస్టాగ్ వాడ‌కంలో ఉంటుంది.