Covid: కేరళలో ఈరోజు 115 కొత్త కేసులు.. ఇంకా పెరిగే అవకాశం
Covid: కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 కేరళలో (kerala) విజృంభిస్తోంది. ఈ ఒక్క రోజే 115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,749గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యావత్ భారత దేశంలో కొత్త యాక్టివ్ కేసులు 142 ఉండగా.. ఇందులో 115 కేరళలో ఉన్నవే. ఇప్పటివరకు కేరళలో దాదాపు ఐదుగురు కోవిడ్ వల్ల చనిపోయారు. ఈరోజు వెలువడిన కేసుల్లో ఒక్క మృతి కూడా లేదు. ఇక గత 24 గంటల్లో కోవిడ్ బారిన పడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 112.