Titan Submarine: కోటీశ్వరులను ట్రాప్ చేయడానికే..!
Hyderabad: అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్లి ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో టైటాన్ సబ్ మెరైన్ను (titan submarine) డిజైన్ చేసిన CEO స్టాక్టన్ రష్ (stockton rush) కూడా ఉన్నారు. అయితే ఈ సబ్ మెరైన్ (titan submarine) ఎప్పుడో ఒకప్పుడు పేలిపోయి అందరి ప్రాణాలు తీస్తుందని స్టాక్టన్కు ముందే తెలుసని ఆయన ఫ్రెండ్ స్టాన్లే తెలిపారు. అంతేకాదు.. కోటీశ్వరులను ట్రాప్ చేయడానికే ఈ భయంకరమైన సబ్ మెరైన్ను స్టాక్టన్ తయారుచేసారని ఆరోపించారు.
2019లో బహమాస్‌లో స్టాక్టన్ తనను ట్రయల్ డైవ్ అని చెప్పి ఈ సబ్ మెరైన్‌లో తీసుకెళ్లాడని స్టాన్లే తెలిపారు. ఆ సమయంలోనే సబ్ మెరైన్ డిజైన్‌ను బట్టి అది కార్బన్ ఫైబర్, టైటానియమ్ ట్యూబ్స్‌తో డిజైన్ చేసారు అని అర్థమైందని, గత నెలలో జరిగిన ప్రమాదం కూడా ఆ కార్బన్ ఫైబర్ పైప్ పేలిపోవడం వల్లేనని తెలిపారు.చరిత్ర సృష్టించడానికి స్టాక్టన్ తన జీవితాన్ని ఇతరుల జీవితాన్ని పణంగా పెట్టాడని స్టాన్లే బాధపడ్డారు. ఆ సబ్ మెరైన్ ఏ రేంజ్లో పేలిపోయి ఉంటుందో తన మైండ్‌లో ఆల్రెడీ ఊహించుకున్నానని అన్నారు. తను ఊహించినదాని కంటే దారుణంగా పేలిపోయి ఉంటుందని తెలిపారు. (titan submarine)
రీసెంట్గా ఓషన్ గేట్ మరో ప్రకటన చేసింది. టైటానిక్ శకలాలను చూడాలనుకునే అతి కొద్ది మందిలో మీరూ భాగం అవుతారా? అంటూ మరో ట్రిప్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ట్రిప్ వివరాలను ఓ వెబ్సైట్లో పోస్ట్ చేసారు. 2024లో జూన్ 12 నుంచి జూన్ 29 వరకు ట్రిప్‌లో పాల్గొనాలనుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకొక్కరికి అయ్యే ఖర్చు $250,000. అయినా ఐదుగురి ప్రాణాలు పోయాక కూడా మళ్లీ ట్రిప్ అనౌన్స్మెంట్ చేసిన ఓషన్ గేట్ సంస్థకు ఇంతటి కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడంలేదు.