Lord Krishna: మ‌రో య‌శోద‌.. కృష్ణుడికి ప్యాంట్ ష‌ర్ట్ వాచీ..!

Hyderabad: కృష్ణుడికి అంటే య‌శోదకు ఎంత ప్రేమో మ‌న‌కు తెలిసిందే (lord krishna). అయితే ఈ య‌శోద గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ కింది ఫొటోలో క‌నిపిస్తున్న మ‌హిళ పేరు సంధ్య. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఈమె పెళ్లి అయ్యాక బృందావ‌న్‌కు వ‌చ్చి నివ‌సిస్తోంది. ఈమెకు ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే ఓసారి బృందావ‌న్‌లోని కృష్ణుడి ఆల‌యానికి వెళ్లింద‌ట‌. అక్కడ క‌న్న‌య్య‌ను చూసి ఎంతో ప‌ర‌వ‌శించిపోయింద‌ట‌. ఆ క‌న్న‌య్య‌తో త‌న‌కు క‌న్న‌త‌ల్లి అనుబంధం గుర్తుకొచ్చింది. అంతే.. వెంట‌నే ఓ కృష్ణుడి బొమ్మ‌ను కొనుగోలు చేసి దానినే త‌న సొంత కొడుకులా చూసుకుంటోంది. అంతేకాదు రోజూ బృందావ‌న్‌కు వెళ్లేట‌ప్పుడు కృష్ణుడి బొమ్మ‌కు ప్యాంట్, ష‌ర్ట్, వాచీల‌తో రెడీ చేసి తీసుకెళ్తూ ఉంటుంద‌ట‌.

ఉద‌యం నిద్ర లేవ‌గానే త‌న క‌న్న‌బిడ్డ‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ముందు త‌న క‌న్న‌య్య‌ను ప్రేమ‌గా నిద్ర‌లేపుతుంది సంధ్య. ఆ త‌ర్వాత విగ్ర‌హానికి వేడి నీళ్ల‌తో స్నానం చేయిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో టీ ఇస్తుంది. అప్పుడ‌ప్పుడు పాలు కూడా ఇస్తుంటుంది. ఎంతో జాగ్ర‌త్త‌గా త‌న క‌న్న‌య్య కోసం ఆహారం వండుతుంది. ముందు క‌న్న‌య్య విగ్ర‌హానికి రుచి చూపించాకే ఇంట్లోవారికి తినిపిస్తుంద‌ట‌. నిజంగా మ‌రో య‌శోద‌ను చూస్తున్న‌ట్లు ఉంది క‌దూ..! (lord krishna)

Sandhya Mishra
Sandhya Mishra