Viral News: ముక్కకు మాత్రమే అంత్యక్రియలు..!
Viral News: ఓ మనిషి మృతదేహానికి చేసే అంత్యక్రియలను ఓ మహిళ కేవలం తన ముక్కుకు మాత్రమే చేయించుకుంది. అయితే ఆమె చనిపోలేదనుకోండి. అయినా సరే.. బతికుండగానే తన ముక్కుకు అంత్యక్రియలు నిర్వహించుకుంది. ఎందుకో తెలియాలంటే ఆమె కథ తెలుసుకోవాల్సిందే..!
యూకేకి చెందిన సోఫీ అనే ఓ మహిళ తన ముక్కుకు రైనో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ సర్జరీ ప్రక్రియలో మొత్తం ముక్కును తొలగించి వేరే ముక్కును అమరుస్తారు. ఇక తన పాత ముక్కును చూసుకోలేదు కాబట్టి.. తన ముక్కు చనిపోయినట్లు నిర్ణయించుకుని అంత్యక్రియలు నిర్వహించుకుంది. వెర్రి వెయ్యి రకాలంటే ఇదే మరి..!