Khairtabad: ఈసారి గ‌ణ‌నాథుడి విగ్ర‌హం పొడ‌వెంతో తెలుసా?

అంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన పండుగ‌ల్లో వినాయ‌క చ‌వితి ఒక‌టి (ganesh chaturthi). ఈసారి సెప్టెంబర్ 18న వినాయ‌క చ‌వితిని జ‌రుపుకోబోతున్నాం. అయితే హైద‌రాబాద్‌లో వినాయ‌క చ‌వితి అంటే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చేది ఖైర‌తాబాద్ గ‌ణేష్‌ (khairtabad). ఈసారి కూడా బొజ్జ గ‌ణ‌పయ్య సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైపోతున్నారు. ఈసారి వినాయ‌క చ‌వితికి ఖైర‌తాబాద్‌లో 63 అడుగుల విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించ‌నున్నారు. ఇందుకోసం 40 మంది క‌ళాకారులు ప‌నులు ప్రారంభించేసారు.