Shortest Flight: 1.5 నిమిషాలు మాత్రమే ప్రయాణించే విమానం
Shortest Flight: విమాన ప్రయాణమంటే కొన్ని గంటల పాటు చేయాల్సి ఉంటుంది. ఎంతకాదన్నా 2 గంటల నుంచి 24 గంటల వరకు విమాన ప్రయాణాలుంటాయి. కానీ ఈ ఒక్క విమానం మాత్రం అత్యంత తక్కువ సమయమే ప్రయాణిస్తుందట. ఎంత సేపో తెలుసా? జస్ట్ 1.5 నిమిషాలు. ఇది స్కాట్‌లాండ్‌కి చెందిన లోగానెయిర్ సంస్థ విమానం. ఈ విమానం పేరు బ్రిట్టెన్ నార్మన్ BN2B-26 ఐలాండర్.
ఈ విమానం స్కాట్‌లాండ్‌లోని వెస్ట్రే నుంచి పాపా వెస్ట్రే అనే ద్వీపాల మధ్య మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ రెండు ద్వీపాల మధ్య దూరం 1.5 నిమిషాలు మాత్రమే. కొన్ని సార్లైతే నిమిషంలోనే దించేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయంలో ప్రయాణించే విమానం కూడా ఇదేనట. ఇదే రూట్‌లో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు స్టూవర్ట్ లింక్‌లేటర్ అనే పైలట్‌కి ఉంది. ఇతను కేవలం 53 సెకెన్లలో ప్రయాణాన్ని ఆ రెండు ద్వీపాల మధ్య నడిపాడు.
ఈ రెండు ద్వీపాల మధ్య విమనాన్ని 1967లోనే మొదలుపెట్టారు. రోజూ ఈ ద్వీపాల మధ్య విమానం ప్రయాణిస్తూనే ఉంటుంది. కేవలం శనివారాల్లో మాత్రం ఏ విమానం కూడా ఈ ద్వీపం నుంచి ఆ ద్వీపానికి వెళ్లదు. రికార్డు సాధించిన పైలట్ స్టూవర్ట్ మాత్రమే తన కెరీర్‌లో 12 వేల సార్లు ఈ విమానాన్ని నడిపాడట. ఆ తర్వాత ఆయన 2013లో రిటైర్ అయ్యారు. ఈ విమానంలో కేవలం 10 మంది ప్రయాణికులు మాత్రమే సరిపోతారు. పాపా వెస్ట్రే ద్వీపంలో కేవలం 70 మంది మాత్రమే నివసిస్తున్నారు. వారు ఏదన్నా పని మీద వెస్ట్రే వరకు వెళ్లాలంటే ఇదే విమానంలో వెళ్తారు.