Viral News: 17 ఏళ్లుగా తిండి లేకుండా.. డ్రింక్స్‌తో బ‌తికేస్తున్నాడు..!

Iran: ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లుగా తిండి(food) లేకుండా కేవ‌లం డ్రింక్స్‌తో(drinks) బ‌తికేస్తున్నాడు పైన క‌నిపిస్తున్న పెద్ద మ‌నిషి. ఇత‌ని పేరు ఆర్దేషిరి. ఇరాన్‌కి(iran) చెందిన వ్య‌క్తి. ఫైబ‌ర్ గ్లాస్ రిపేర్ చేసుకుంటూ జీవిస్తున్న ఇత‌ను 17 ఏళ్లు సాఫ్ట్ డ్రింక్స్ తాగుడూ బ‌తికేస్తున్నాడ‌ట‌. అస‌లు తిండి అన్న‌మాటే లేద‌ట‌. నీర‌సంగా అనిపించినప్పుడు పెప్సీలాంటి ఏదో ఒక కార్బొనేటెడ్ ఎన‌ర్జీ డ్రింక్ తాగుతాడ‌ట‌. ఇత‌ని గురించి తెలిసి స్థానిక మీడియా వ‌ర్గాలు ఇంట‌ర్వ్యూ చేసాయి. 2006లోనే తిండి మానేసాన‌ని చెప్పాడు. అయితే ఇలా సాఫ్ట్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల త‌న‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాలేద‌ని అంటున్నాడు. ఆర్దేషిరి క‌థేంటో అత‌ని మాటల్లోనే..

“ఓరోజు నా నోట్లో ఏదో వెంట్రుక ఇరుక్కున్న‌ట్లు అనిపించింది. అది నోటి నుంచి క‌డుపు దాకా అడ్డుకున్న‌ట్లు అనిపించింది. నా కంటికి క‌నిపించ‌లేదు కానీ దాన్ని ఎలా తీయాల‌ని చూసినా రాలేదు. దాంతో ఓ రోజు డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాను. వెంట్రుక లాంటిది ఏమీ లేద‌న్నారు. అయినా ఏదో అడ్డుకున్న‌ట్లు అనిపించేది. అలా నేను తిర‌గ‌ని డాక్ట‌ర్లు లేరు. ఇక చేసేదేం లేక ఓసారి కూల్ డ్రింక్ తాగాను. అది తాగాక నాకు అలా ఏదో అడ్డుకున్న‌ట్లు ఫీలింగే క‌ల‌గలేదు. కానీ తిండి ప‌దార్థాల‌ను చూస్తే మాత్రం వాంతులు వ‌చ్చేవి. అలా నేను 17 ఏళ్లుగా డ్రింక్స్‌కే అల‌వాటు ప‌డిపోయాను. నా ఇంట్లో వారు కూడా నా ముందు తిన‌రు” అని తెలిపాడు.