Earth: భూమిపై ఏర్పడిన తొలి ప్రదేశం ఇదే.. మన భారత్‌లోనే ఉంది
Earth: అసలు ఈ భూమి ఎలా ఏర్పిడి ఉంటుంది? భూమిపై ఏర్పడిన తొలి ప్రదేశం ఏది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మదిలో వస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నకు మొత్తానికి సమాధానం దొరికింది. ఈ భూమిపై ఏర్పడిన తొలి ప్రదేశం ప్రస్తుతం మన భారత్‌లోనే ఉంది. ఇంతకీ ఏంటా ప్రదేశం అనుకుంటున్నారా? ఆ ప్రదేశమే ఝార్ఖండ్‌లోని సింగ్‌భుమ్ జిల్లా. ఈ ప్రాంతం 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
సింగ్‌భుమ్ జిల్లాలోని రాళ్లను సేకరించి పరిశోధనలు చేయగా ఈ విషయం తెలిసిందట. భూమి ఉపరితలంలో క్రస్ట్ కింద వేడిగా ఉన్న మాగ్మా, భూభాగంలో కొంత భాగాన్ని మందం చేసింది. ఈ మాగ్మా క్రస్ట్‌ను సిలికా, క్వార్ట్జ్ వంటి తేలికపాటి పదార్థాలతో సమృద్ధిగా మార్చింది. భూభాగం మందంగా తేలికగా మారడంతో మంచు కొండ నీటిపై తేలుతున్నట్లుగా ఆ ప్రదేశం సముద్రం నుండి పైకి వచ్చింది. చివరికి, ఈ భూ భాగం క్రస్ట్ సుమారు 50 కిలోమీటర్ల మందంగా పెరిగి, సముద్ర ఉపరితలం పైకి వచ్చేలా చేసింది. అలా భూమి మీద మొదటి భూభాగంలా ఏర్పడింది.