Dawood Ibrahim ఇప్పుడు చూడ‌టానికి ఎలా ఉన్నారో తెలుసా?

Dawood Ibrahim: ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంని ఆయ‌న స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు త‌ప్ప ఇంకెవ్వ‌రూ స‌రిగ్గా చూడ‌లేదు. ఆయ‌న వ‌య‌సులో ఉన్న‌ప్ప‌టి ఫోటోలు మాత్రమే ఇప్పుడు మ‌నం ఆన్‌లైన్‌లో చూడగ‌లం. ఇప్పుడు దావూద్ వ‌య‌సు దాదాపు 67 ఏళ్లు ఉంటుంది.

దాదాపు 30 ఏళ్లుగా అస‌లు దావూద్ ఎక్క‌డున్నాడో ఎలా ఉన్నాడో చూడ‌టానికి ఎలా ఉంటాడో క‌నీసం పోలీసుల‌కు కూడా తెలీకుండా అంత సీక్రెట్‌గా అండ‌ర్ వ‌ర‌ల్డ్‌లో దాక్కున్నాడు. ఇటీవ‌ల దావూద్‌కు ఎవ‌రో విషం పెట్టార‌ని ఆయన్ను పాకిస్థాన్‌లోని క‌రాచీ హాస్పిట‌ల్‌లో చేర్పించారని వార్త‌లు వ‌స్తుండ‌డంతో ఇండియా మొత్తం దావూద్ దొరికిపోతాడా అన్న టాపిక్ గురించే చ‌ర్చించుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఇప్పుడు దావూద్ ఫోటోలు బ‌య‌టికి వ‌స్తే ఎలా ఉంటాడు అనే సందేహం వ‌చ్చింది. దాంతో కొంద‌రు నెటిజ‌న్లు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఉప‌యోగించి దావూద్ 67 ఏళ్ల వ‌య‌సులో ఎలా ఉంటాడో డిజైన్ చేసి ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టారు.