Viral News: ప్రపంచంలోనే “బెస్ట్ వరస్ట్” హోటల్..!
Viral News: ఒక హోటల్‌కి కానీ రెస్టారెంట్‌కి కానీ వెళ్లేముందు అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయా? ఇలాంటి ఎన్నో అంశాలను చెక్ చేసుకుని వెళ్తంటాం. హోటల్‌కి వెళ్లినప్పుడు మనకు నచ్చకపోయినా ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా మేనేజర్‌ను స్టాఫ్‌ను పిలిచ చెడామడా తిట్టేస్తుంటాం. రేటింగ్‌ల ద్వారా ఫిర్యాదులు కూడా చేస్తుంటాం. అలాంటిది మీరు వెళ్లిన హోటల్‌లో మీకు అవమానం జరిగితే ఊరుకుంటారా? కానీ ఈ హోటల్‌లో ఊరుకోవడమే కాదు ఎన్ని మాటలు అన్నా గౌరవంగా స్వీకరిస్తారు. ఈ హోటల్‌లో మాత్రం మీకు గౌరవం ఇవ్వరు. మీతో దురుసుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. అయినా సరే.. ఈ హోటల్‌కి వెళ్లే కస్టమర్య సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది కానీ తగ్గడంలేదు. ఈ హోటల్ కథేంటో తెలుసుకుందాం.
ALSO READ: ఈ రెస్టారెంట్‌లో డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటారట
ఈ హోటల్ పేరు కారెన్స్. లండన్‌లోని బర్నెట్‌లో ఉంది. ఈ హోటల్‌లో ఒక రాత్రి స్పెండ్ చేయాలంటే మన కరెన్సీలో రూ.20,000 కట్టాలి. ఈ హోటల్‌లోని సిబ్బంది కస్టమర్లను రిసీవ్ చేసుకోరు. గదులు ఉన్నాయా అని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తూ తాళాలు మీదకు విసిరేసి మీరే వెళ్లండి అని చెప్తారు. డబ్బులు కట్టినా కూడా ఇలాగే అవమానిస్తుంటారు. నీళ్లు కావాలని అడిగితే.. ఆ సింక్‌లో ఉన్నాయి పోయి తాగు అని ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఇంత అవమానించినా కూడా కస్టమర్లు వారిని ఒక్క మాట అనరు. పైగా ఆనందంగా వారి తిట్లను భరిస్తుంటారు. అయితే ఈ హోటల్‌లోని సిబ్బంది ఏదో కోపంతోనో పగతోనో ఇలా ప్రవర్తించడంలేదు. ఇలా కస్టమర్ల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించేందుకు వారికి యాజమాన్యం డబ్బులు ఇస్తుంది. (Viral News)
మరో విచిత్రం ఏంటంటే.. ఈ కారెన్స్ హోటల్ ప్రపంచంలోనే ఉత్తమమైన వరస్ట్ హోటల్ అని ప్రకటనలు కూడా ఇస్తుంటుంది. 2021లో ఈ కారెన్స్ హోటల్‌ను ముందు ఆస్ట్రేలియాలో ఓపెన్ చేసారు. ఆ తర్వాత బ్రిటన్‌లో కూడా పెట్టారు. ఇటీవల ఈ హోటల్‌కు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో వెయిటర్ ఆహారాన్ని బల్లపై విసిరేస్తూ వడ్డిస్తోంది. అది చూసి ఇలాంటి హోటల్‌కు మీరు వెళ్తారా అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు దాదాపు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హోటల్‌కు వచ్చే కస్టమర్లతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో నేర్పిస్తారు. కానీ ఈ హోటల్‌లో మాత్రం కస్టమర్లతో ఎంత దురుసుగా ప్రవర్తించాలో ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తారు.
ALSO READ: ఇక్కడ ఎంత తిన్నా బిల్లు కట్టనక్కర్లేదు!
అసలు ఈ హోటల్‌లో ఇలాంటి వింత రూల్ ఎందుకు పెట్టారో మాత్రం తెలియరాలేదు. ఏ హోటల్‌కి వెళ్లినా అక్కడి సిబ్బంది చూపించే మర్యాద వేరేగా ఉంటుంది. ఆ మర్యాదలు చూసి చూసి బోర్ కొట్టేసినట్లుంది. అందుకే కాస్త కొత్తగా, క్రియేటివ్‌గా ఉంటుందని ఇలాంటి రూల్ పెట్టారేమో. పైగా సిబ్బంది నిజంగానే కోపంతో, పగతో కస్టమర్లతో అలా ప్రవర్తించడంలేదు. వారు నటిస్తున్నారు అన్న విషయం కస్టమర్లకు కూడా తెలుసు. అందుకే తెగ ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ఇలాంటి హోటల్ మన ఇండియాలో పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. వామ్మో.. మామూలుగానే మనోళ్లకు కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే చంపుకునేదాకా వెళ్తారు. ఇక ఇలా అమర్యాదపూర్వకంగా ప్రవర్తించే సిబ్బంది ఉన్న హోటల్‌కు ఇక్కడ పెట్టుకుంటే శాల్తీలు లేచిపోవూ…!