Katrina Kaif ను పూజిస్తున్న కుటుంబం..!
Haryana: బాలీవుడ్ బార్బీ గర్ల్ కత్రినా కైఫ్‌ని (katrina kaif) ఇష్టపడివారంటూ ఉండరనే చెప్పాలి. ఇండస్ట్రీకి ఎంత మంది హీరోయిన్లు పరిచయం అయినా కత్రినాను వెనక్కి నెట్టేవారు లేరు. అయితే ఇష్టమైన హీరో, హీరోయిన్లకు గుడి కట్టించి పూజలు చేసే వారు చాలా మంది ఉన్నారు. తమిళనాడులో నటి నమిత కోసం ఎన్నో ఏళ్ల క్రితం గుడి కట్టారు. రీసెంట్‌గా సమంత కోసం కూడా ఓ అభిమాని గుడి కట్టించాడు. అయితే కత్రినా కైఫ్‌కి కూడా అలాంటి అభిమానులు ఉన్నారు. హర్యానాకు చెందిన బంటు, సంతోష్ దంపతులకు కత్రినా కైఫ్ అంటే ఎంతో అభిమానం. ఎంత అంటే.. కత్రినా (katrina kaif) కోసం గుడి కట్టించే స్థోమత వారికి లేకపోయినా తమ ఇంట్లోని గోడలపై అన్నీ కత్రినా కైఫ్ ఫొటోలు అంటించేసారు.
కత్రినా (karina kaif) బర్త్‌డే వచ్చిందంటే చాలు కేక్ కట్ చేసి చుట్టు పక్కల వారికి స్వీట్లు పంచిపెడతారు. తమ ఇంటి బిడ్డ బర్త్‌డే అన్నట్లు తమకున్న దాంతో ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారట. ఇలా దాదాపు పదేళ్ల నుంచి చేస్తున్నారు. వారికి పదేళ్లు ఉన్న కోరిక ఏంటంటే.. ఎప్పటికైనా కత్రినా కైఫ్‌ను కలవాలట. ముంబై వెళ్లి కలిసేంత స్థోమత లేదని, కనీసం మీడియా ద్వారా అయినా కత్రినా తమ కోసం వస్తుందని ఆశపడుతున్నారు.