పెళ్లిళ్లు చెడగొట్టే ఈ కంపెనీ గురించి తెలుసా?

this company cancels weddings

Marriage: కొంద‌రికి పెళ్లి చేసుకోవ‌డం ఇష్టంలేక‌పోయినా బ‌ల‌వంతంగా చేస్తుంటారు. మ‌రికొంద‌రు త‌ల్లిదండ్రుల కోస‌మో లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో చ‌చ్చిన‌ట్లు చేసుకోవాల్సి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మేమున్నాం అంటూ ఓ కంపెనీ ముందుకొచ్చింది. పెళ్లికి కంపెనీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండీ.. మీకు పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేక‌పోయినా పెళ్లి చేయాల‌ని చూస్తున్నారనుకోండి.. ఈ కంపెనీ మీ పెళ్లి చెడ‌గొట్టే బాధ్య‌త తీసుకుంటుంది. స్పెయిన్‌కి చెందిన ఎర్నెస్టో రైనేర్స్ అనే కంపెనీ వెడ్డింగ్ గేట్ క్రాషింగ్ సంస్థ‌గా కోట్ల‌ల్లో అర్జిస్తోంది.

మీకు మీ పెళ్లిపై సందేహాలు ఉన్నా? ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా.. మాకు స‌మాచారం ఇవ్వండి. మేమే మీకు ఎలాంటి స‌మ‌స్య రాకుండా మీ పెళ్లి చెడ‌గొట్టేస్తాం అని ఈ కంపెనీ ఓ యాడ్ వేసింది. దాంతో బోలెడు మంది వ‌ధూవ‌రుల నుంచి రిక్వెస్ట్‌లు వ‌చ్చాయ‌ట‌. ఎన్ని రిక్వెస్ట్‌లు వ‌చ్చాయంటే బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి.

అస‌లు ఈ కంపెనీ చేసే పనేంటి?

సింపుల్.. ఒక‌వేళ వ‌రుడికి కానీ వ‌ధువుకి కానీ పెళ్లి ఇష్టం లేక‌పోతే రెండు రోజుల ముందే కంపెనీకి ఈ విష‌యాన్ని చెప్పాలి. ఇందుకు కంపెనీకి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. స‌రిగ్గా పెళ్లి స‌మ‌యానికి కంపెనీ ఏర్పాటుచేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్న‌ట్టుండి పెళ్లి వేడుక‌లోకి దూరి నేను ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమించాన‌ని ర‌చ్చ చేసి అక్క‌డి నుంచి వ‌రుడు, వ‌ధువుల‌ను తీసుకెళ్లిపోతారు.

ఒకవేళ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేక‌పోతే అబ్బాయిని పుర‌మాయిస్తారు. అబ్బాయికి పెళ్లి ఇష్టం లేక‌పోతే అమ్మాయిని పుర‌మాయిస్తారు. మ‌రి ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు పెళ్లిళ్ల‌లో గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. పెళ్లికి వ‌చ్చిన బంధువులు చేయి చేసుకుంటూ ఉంటారు కూడా. కంపెనీ పుర‌మాయించేవారు దెబ్బ‌లు కూడా తినాల్సి వ‌స్తుంది. వారు తీసుకున్న డ‌బ్బుకు న్యాయం చేసేలా దెబ్బ‌లు కూడా తింటారు. ఇలా పెళ్లిళ్లు ఆపేందుకు ఆ కంపెనీ 50 వేల యూరోలు తీసుకుంటుంది. అయితే దెబ్బ ప‌డితే మాత్రం ప్ర‌తి దెబ్బ‌కు అద‌నంగా 50 యూరోలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.