దేవ‌ర చూసి చ‌నిపోతా.. బ్ల‌డ్ క్యాన్స‌ర్ బాధితుడి ఆవేద‌న‌

this blood cancer patient wants to die after watching devara

Devara: పై ఫోటోలో క‌నిపిస్తున్న యువ‌కుడిని చూసారా? ఈ అబ్బాయి పేరు కౌశిక్. తిరుప‌తికి చెందిన కౌశిక్‌కి జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. కౌశిక్ కొంత‌కాలంగా బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నాడు. వారం రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించ‌డంతో బెంగ‌ళూరులోని ఓ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అయితే క్యాన్స‌ర్ లాస్ట్ స్టేజ్‌లో ఉంద‌ని.. ఇక బ‌తికించ‌లేమ‌ని వైద్యులు చేతులెత్తేసారు. అయితే త‌న అభిమాన న‌టుడు ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ఈ నెల 27న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో.. ఈ సినిమా చూసేంత వ‌ర‌కైనా బ‌తికించండి సార్ అని వైద్యుల‌ను వేడుకుంటున్నాడు. ఆ యువ‌కుడి చికిత్స‌కు రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని అంత డ‌బ్బు త‌మ వ‌ద్ద లేద‌ని కౌశిక్ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఎన్టీఆర్ కానీ ఆయ‌న అభిమానులు కానీ సాయం చేస్తారేమో అన్న ఆశ‌తో బ‌తుకుతున్నారు.