భర్తలు పనిచేయకపోతే.. ఈ యాప్ భార్యలకు చెప్పేస్తుంది!
Hyderabad: ఇంటి పని అన్నాక భార్యాభర్తలు ఇద్దరూ చేసుకోవాలి(viral news). భార్య (wife) ఒక్కరే చేయాలి లేదా భర్త (husband) ఒక్కరే చేయాలి అంటే కుదరదు. ఇద్దరికీ సమాన బాధ్యత ఉండాలి. అయితే కొన్ని సార్లు వర్క్ హడావిడిలో పడిపోయి కొందరు భర్తలు ఇంటి పని మర్చిపోతుంటారు. మరికొందరు కావాలనే పని నుంచి తప్పించుకోవాలని చూస్తారు. ఇక అలా కుదరదు. ఎందుకంటే స్పానిష్ ప్రభుత్వం (spain government) ఓ యాప్‌ని (app) కనిపెట్టింది. ఈ యాప్‌లో భర్త పనిచేయకపోతే భార్యకు కంప్లైంట్ వెళ్లిపోతుంది. ఇంటి పనుల విషయానికొస్తే ఎక్కువగా ఆడవారే కష్టపడుతుంటారు. దాంతో వారికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతోంది.
సమానంగా ఇంటి పనులు చూసుకోగలిగితేనే ఆ దాంపత్య జీవితం ఇంకా బాగుంటుంది అన్న ఆలోచనతో స్పెయిన్ ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. పైగా ఈ యాప్ గురించి కమిటీలోనూ ప్రకటించారు. ఈ యాప్ ద్వారా భార్య, భర్త కుదిరితే పిల్లలు సమానంగా వారి పనులు వారు చేసుకుంటున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. ఒక వేళ భార్య చేయకపోయినా భర్త చేయకపోయినా యాప్ రికార్డ్ చేసేస్తుంది. దీని ద్వారా ఎవ్వరికీ వర్క్ లోడ్ ఉండదని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఈ యాప్‌ను రూపొందించడానికి కాస్త ఎక్కువ ఖర్చైనా ఫర్వాలేదని ప్రజలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయడం కోసమే దీనిని మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నామని ప్రకటించింది. ఇది కేవలం భార్య భర్తల కోసమే కాదు. ఇంట్లో ఎంత మంది పెద్దవాళ్లుంటే వారందరికీ వర్తిస్తుంది.