Idly రూ.530.. దోస రూ.600..!
Idly: ఇడ్లీ, దోస మనం రోజూ తినే టిఫిన్లు. ప్రదేశాలకు బట్టి వీటి రేట్లు ఉంటాయి. ఎంత రేటు ఉన్నా మరీ రూ.600, రూ.530 ఉంటే అసలు తినగలుగుతామా? ఇంతకీ ఇంత రేట్లతో వీటిని ఎక్కడ అమ్ముతున్నారు అనుకుంటున్నారా? కంగారుపడకండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదులే. ముంబై విమానాశ్రయంలో ఈ రేట్లతో అమ్ముతున్నారు. ఓ ప్రయాణికుడు ఫ్లైట్‌కి ఇంకా సమయం ఉంది కదా అని స్థానిక దోస సెంటర్‌లో ఒక దోస ఆర్డర్ పెట్టుకున్నాడు. బిల్లు కట్టేటప్పుడు రూ.650 అని చెప్పారట. దాంతో అతను షాకయ్యాడు. పొరపాటున విన్నాడేమో అనుకుని మళ్లీ అడిగాడు.
అతను పొరపాటుగా ఏమీ వినలేదు. ఇది నిజమే. అక్కడ ఈ రేంజ్ రేట్లలో సాధారణ ప్రజలు తినే వాటిని అమ్మేస్తున్నారు. అతను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. కొందరైతే వీటిని తినడం కంటే బంగారం కొనుక్కుంటే చీప్‌గా వస్తుందేమో అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి సెంటర్లపై కేసు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే వారంతా రిచ్ అనుకుంటే పొరపాటని.. మధ్యతరగతి వారు కూడా ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.