Hamas: ఆ 13 మంది దాడుల్లో మరణించారు..హమాస్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్.. గాజాలోని హమాస్ (hamas) సంస్థపై మెరుపు దాడులకు పాల్పడటంతో.. ఇజ్రాయెల్‌కు (israel) చెందిన 13 మందిని తమ ఆధీనంలో పెట్టుకుంది హమాస్ సంస్థ. దాడులు ఆపకపోతే వారిని చంపేస్తామని బెదిరించింది. కానీ ఇజ్రాయెల్ వారిని వదిలితేనే గాజాకు నీరు, విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని చెప్పింది. అయితే ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఆ 13 మంది బందీలు మరణించినట్లు హమాస్ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులే వారిని చంపి ఆ నింద ఇజ్రాయెల్‌పై వేస్తోందని మరికొందరి వాదన.