Aditya L1: L1 అంటే ఏంటి.. ఇస్రో ఎలా ప్లాన్ చేసింది?

చంద్ర‌యాన్ 3ని (chandrayaan 3) ఇస్రో (isro) స‌క్సెస్‌ఫుల్‌గా ప్ర‌వేశ‌పెట్టి చంద్రుడి ద‌క్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా నిలిచేలా చేసింది. ఇప్పుడు ఆదిత్యుని వంతు. చంద్రుడిపై చేయాల్సిన అన్ని రీసెర్చ్‌లు అవుతున్నాయి కాబ‌ట్టి.. ఇక సూర్యుడిపై ఏం జ‌రుగుతోందో తెలుసుకోవాలని ఇస్రో ప్లాన్ వేసింది. దీనికి ఆదిత్య ఎల్ 1 (aditya l1)అని నామ‌క‌ర‌ణం చేసారు. సెప్టెంబ‌ర్2న ఉద‌యం 11:50 గంట‌ల స‌మ‌యంలో ఇస్రో దీనిని లాంచ్ చేయ‌నుంది.

అస‌లు ఈ మిష‌న్ విష‌యాలేంటి?

దీనికి ఎల్ 1 అని ఎందుకు పేరు పెట్టారంటే.. ఇస్రో లాంచ్ చేసే స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడి బ‌య‌టి వాతావ‌ర‌ణాన్ని ఎల్ 1 అనే పాయింట్ నుంచి ప‌రిశీలిస్తుంది. ఎల్ 1 అంటే లాగ్రేంజ్ పాయింట్ అని అర్థం. జోసెఫ్ లూయి లాగ్రేంజ్ అనే ఫ్రెంచ్ గ‌ణిత‌శాస్త్రవేత్త 18వ శ‌తాబ్దంలోనే ఈ పాయింట్ల‌పై ప‌రిశోధ‌న చేసారు. లాగ్రేంజ్ పాయింట్స్ వ‌ల్ల సూర్యుడు, భూమి వంటి భారీ ఆబ్జెక్ట్‌ల గురుత్వాకర్షణ శక్తులు సమతుల్యం అవుతాయి. అంతేకాదు.. ఈ పాయింట్స్ సాయంతోనే ఇంధ‌నం త‌క్కువ‌గా ఉపయోగిస్తూ సూర్యుడిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి  మ‌న స్పేస్ క్రాఫ్ట్ ఒక స్పాట్‌ను వెతుక్కుంటుంది. ఆ స్పాట్‌నే లాగ్రేంజ్ అని అంటారు. ఈ ఎల్ 1 లాగ్రేంజ్ అనేది మ‌న భూమి నుంచి 1.5 మిలియ‌న్ కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. (aditya l1)

ఎల్ 1 పాయింట్ ద‌గ్గ‌ర ఏర్పాటుచేసే మ‌న సాటిలైట్ వ‌ల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిని ప‌రిశీలిస్తూ.. రీసెర్చ్ చేసే వీలు ఉంటుంది. రియ‌ల్ టైంలో సూర్యుడిపై ఏర్ప‌డే గ్ర‌హ‌ణాలు, వాటి వ‌ల్ల వ‌చ్చే ఎఫెక్ట్స్ గురించి అప్డేట్లు ఇస్తుంది. ఈ ఆదిత్య ఎల్ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ని PSLV-C57 రాకెట్‌తో లాంచ్ చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన అంశాలు

ఇస్రో ప్ర‌కారం ఆదిత్య ఎల్ 1ని డిజైన్ చేయడానికి గ‌ల ముఖ్య‌మైన కార‌ణం సూర్యుడి ఉప‌రిత‌ల భాగాన్ని స్ట‌డీ చేయ‌డం. ఈ ఉప‌రిత‌ల భాగాన్ని క్రోమోస్ఫియ‌ర్ లేదా క‌రోనా అని అంటారు. సూర్యుడి ఉప‌రిత‌ల వాతావ‌ర‌ణంలో ఉండే గ్యాస్ ఎల‌క్ట్రిక్ పార్టిక‌ల్స్‌తో చార్జ్ అయివుంటుంది. వాటి బిహేవియ‌ర్ ఎలా ఉంటుందో మ‌న ఆదిత్య ఎల్ 1 స్ట‌డీ చేసి ఇస్రోకు తెలియ‌జేస్తుంది. సూర్యుడి బ‌య‌టి పొర ఎలా వేడెక్కుతుంది? సోలార్ క‌ణాలు, సోలార్ మెటీరియ‌ల్‌లోని ప‌వ‌ర్‌ఫుల్ ఎజెక్ష‌న్లు ఎలా మొద‌ల‌వుతాయి? అవి ఎలా పెరుగుతాయి? వంటి విష‌యాల‌న్నీ మ‌న ఆదిత్య ఎల్ 1 క‌నుక్కుంటుంది. అంతేకాదు.. సూర్యుడి బ‌య‌టి పొర‌లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కూడా రీసెర్చ్ చేస్తుంది. (aditya l1)

పేలోడ్స్

ఆదిత్య ఎల్ 1లో 7 పేలోడ్స్ ఉంటాయి. ఈ పేలోడ్స్.. సూర్యుడి క్రోమోస్ఫియ‌ర్, ఫోటోస్ఫియ‌ర్, సోలార్ గాలుల గురించి రీసెర్చ్ చేస్తుంది. ఈ పేలోడ్స్‌లో వాడిన టూల్స్ నాలుగు విధాల ద్వారా సూర్యుడి ఫోటోలు తీస్తాయి. ఒక‌టి లైట్ ఆన్ చేసి, మ‌రొక‌టి అల్ట్రావైలెట్ లైట్, ఇక మూడోది ఎక్స్ రే లైట్ ద్వారా.