Robbery: ఇది ఐఫోన్ కాదా.. ఫోన్ కొట్టేసి వెనక్కిచ్చేసిన దొంగ..!
Robbery: ఓ దొంగ తెలివిగా ఫోన్ కొట్టేసి.. చివరికి అది ఐఫోన్ కాదు ఆండ్రాయిడ్ అని తెలుసుకుని వెనక్కి ఇచ్చేసాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను పికప్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు దొంగలు తుపాకీలు గురిపెట్టి వారి వద్ద ఉన్నవన్నీ లాగేసుకున్నారు. ఫోన్లు కూడా లాక్కున్నారు కానీ అవి ఆండ్రాయిడ్ అని తెలిసి ఛీ ఇవి ఆండ్రాయిడా.. ఐఫోన్ అనుకున్నాం అని తిట్టుకుని ఫోన్లు తిరిగిచ్చేసి పారిపోయారట. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. ఫోన్లు వెనక్కి తిరిగిచ్చేసారు కానీ తమకు పట్ల జరిగిన ఘటనను వివరిస్తూ ఆ మహిళ వణికిపోయింది.